Saturday, March 14, 2026
Homeసినిమా‘వాల్తేరు వీరయ్య’లో ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ

‘వాల్తేరు వీరయ్య’లో ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘ ద్వారా మరోసారి పక్కా మాస్ పాత్రలో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై  నవీన్ యెర్నేని, వై రవిశంకర్  నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ  ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.  రవితేజ పాత్రకు సంబంధించిన పోస్టర్ నేడు విడుదల చేశారు.  ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ నటిస్తున్నారు.   రవితేజ  గొడ్డలి తో గ్యాస్ బండను లాగుతున్నట్లు పోస్టర్ లో కనిపిస్తోంది. మరో చేత్తో పెట్ డాగ్ ను ఎత్తుకున్నారు. ఈ లుక్ రవితేజ మాస్ మేనరిజాన్ని చూపెట్టేట్లుగా ఉంది.

ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ “అతని background – కేవలం hard-work …… అతని సపోర్ట్ – ప్రేమించే మాస్’ అంటూ చిరంజీవి కామెంట్ చేశారు.  చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం వీరిద్దరి మధ్యా రెండు పాటలను యూరప్‌ లో చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular