Sunday, January 19, 2025
Homeసినిమా‘రావణాసుర’ సెట్స్‌ లో జాయిన్ అయిన ర‌వితేజ‌

‘రావణాసుర’ సెట్స్‌ లో జాయిన్ అయిన ర‌వితేజ‌

Mass Joined: మాస్ మ‌హరాజా ర‌వితేజ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘రావ‌ణాసుర‌’. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల లాంఛనంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. తొలి షెడ్యూల్‌లో ర‌వితేజ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ డే ‘రావణాసుర’ అని తెలియ‌జేస్తూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా లాంఛింగ్ రోజునే సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు నిర్మాతలు ప్రకటించారు. రవితేజ ఇందులో లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా రామ్ అనే కీల‌క పాత్ర‌లో హీరో సుశాంత్ న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు.

Also Read : ఫిబ్రవరి 11న వస్తున్న రవితేజ ‘ఖిలాడి’

RELATED ARTICLES

Most Popular

న్యూస్