Sunday, September 8, 2024
Homeసినిమాతుపాకులు.. తూటాలతో సాగే 'ఈగల్'

తుపాకులు.. తూటాలతో సాగే ‘ఈగల్’

రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ‘ఈగల్’ సినిమా, ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ ఇలా అన్నీ అంతకంతకూ అంచనాలు పెంచుతూ వచ్చాయి. దాంతో సినిమాలో బలమైన కంటెంట్ ఉండే ఉంటుందనే నమ్మకంతో థియేటర్లకు వెళ్లినవారు ఎక్కువ. కథ పాతదో ..  కొత్తదో మొత్తానికైతే ఒక కథ ఉంది. కథను నడిపించడానికి హీరో .. ఆయనను ఉత్సాహపరచడానికి హీరోయిన్ కావాలి గనుక, ఆమె కూడా ఉంది.

ఇక హీరో ఇంట్లో పూల మొక్కలు ఉండవు.. ఎటు చూసినా ఆయుధాలు ఉంటాయి. అలా అని చెప్పేసి ఆయన ఆయుధాలను తయారు చేసేవాడు కాదు. ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకుని, దుర్మార్గుల చేతికి అవి చేరకూడదనే ఉద్దేశంతో కొట్టుకొచ్చి దాచేస్తూ ఉంటాడు. మరి ఆయుధాలతో బిజినెస్ చేసుకునేవారు ఊరుకుంటారా? వెతుక్కుంటూ మరీ వచ్చేయరూ. అలా వచ్చినవారిని తిరిగి వెళ్లనిచ్చే అలవాటు హీరోకి ఉందా అంటే అదీ లేదు. అందుకే ఇక్కడే వార్ మొదలవుతుందన్న మాట.

సాధారణంగా తుపాకీతో ఎలా కాల్చినా.. తూటా తగిలిన ప్లేస్ ను బట్టి అవతలవాడు చస్తాడు. అలాంటిది ఈ సినిమాలో హీరో ఇంటి గోడలపై నుంచి.. జీపు చక్రాల నుంచి.. ఇంటి బయట ఉన్న కాళికాదేవి విగ్రహం చేతి వ్రేళ్లలో నుంచి బుల్లెట్లు దూసుకొస్తూనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ తగ్గినా.. యాక్షన్ సీన్స్ లో ఇలాంటి విన్యాసాలు కనిపిస్తాయి. హీరోయిన్ ఆకలి తీర్చడం కోసం హీరో తన గన్ తో షూట్ చేసి, ఆపిల్స్ ఆమె దగ్గర పడేలా చేస్తాడు. దీనిని బట్టి హీరో ఏ రేంజ్ లో గన్స్ ఉపయోగించాడనేది అర్థం చేసుకోవచ్చు. తుపాకుల శబ్దాలను తట్టుకునే ఓపిక ఉంటే, తూటాకి.. తూటకీ మధ్యలో నడిచే కథను చూడొచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్