Friday, March 20, 2026
Homeసినిమాశ్రీ విష్ణు హీరోగా ‘అల్లూరి’ ప్రీలుక్ రిలీజ్ చేసిన‌ రవితేజ

శ్రీ విష్ణు హీరోగా ‘అల్లూరి’ ప్రీలుక్ రిలీజ్ చేసిన‌ రవితేజ

Alluri- Sri Vishnu:  వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ శ్రీవిష్ణు నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. శ్రీవిష్ణు ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ లక్కీ మీడియా బ్యాన‌ర్ పై బెక్కెం వేణుగోపాల్, బెక్కెం బబిత నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ప్రదీప్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం భిన్నమైన కథాంశంతో రూపొందుతోంది. కాగా, ‘అల్లూరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా ప్రీలుక్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు.

టైటిల్ లోగోలో రెండు తుపాకులు కనిపిస్తున్నాయి. విష్ణు ముఖం కనిపించనప్పటికీ, శ్రీవిష్ణు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు.  పోస్టర్ సూచించినట్లుగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో సిన్సియర్ పోలీసు పాత్ర పోషిస్తున్నాడు.  యూనిఫామ్ లో కనిపించిన విధంగా సినిమాలో అతని పేరు ఎ.ఎస్. రామరాజు. ఇది గొప్ప పోలీసు ఆఫీసర్ కథ. ఈ ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు సినిమా పై క్యూరియాసిటీని పెంచుతోంది.

శ్రీవిష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. నాగార్జున వడ్డే (అర్జున్), ఎం విజయలక్ష్మి, గంజి రమ్య సహ నిర్మాతలు. అల్లూరి షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular