Thursday, March 12, 2026
Homeసినిమారవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ డేట్ ఫిక్స్..

రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ డేట్ ఫిక్స్..

రవితేజ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంశీ దర్శకత్వంలో చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్,  అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.

ఇప్పుడు టైగర్ దండయాత్ర  మొదలుకాబోతుంది. ఆగస్ట్ 17న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు రాకకు చిహ్నంగా టీజర్ పోస్టర్‌లో బిగ్ యాక్షన్‌లోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.

దర్శకుడు వంశీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు, తనకి నిర్మాతల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది రవితేజకు హయ్యెస్ట్  బడ్జెట్‌ మూవీ. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున, మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular