Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య మూవీలో ర‌వితేజ?

బాల‌య్య మూవీలో ర‌వితేజ?

Balayya-Raviteja: న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ సినిమా ఇచ్చిన విజ‌యంతో వరుస‌గా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. అఖండ త‌ర్వాత బాల‌య్య సినిమా అంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. అయితే.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా ఉంటుంద‌ని గోపీచంద్ మ‌లినేని అన్నారు.

ఇదిలా ఉంటే.. బాల‌య్య, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జూన్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో మ‌రో హీరో పాత్ర ఉంద‌ని.. ఆ పాత్ర‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో చేయించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

సెకండ్ హీరో పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. అయితే.. ఇందులో నిజంగానే ర‌వితేజ న‌టిస్తున్నాడా..? ద‌స‌రాకి ఖ‌చ్చితంగా రిలీజ్ అవుతుందా..?  అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్