Sunday, March 15, 2026
Homeసినిమామెగాస్టార్ మూవీలో మాస్ మహారాజ్?

మెగాస్టార్ మూవీలో మాస్ మహారాజ్?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ మూవీలో మాస్ మహారాజా రవితేజ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇంతకీ ఏ సినిమాలో అనేది ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి, బాబీ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఆమధ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మాస్ లుక్ లో ఉన్న చిరంజీవి లుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి సినిమా ‘అన్నయ్య’లో రవితేజ నటించారు. ఆతర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు మూడవసారి చిరు మూవీలో రవితేజ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular