Thursday, March 12, 2026
Homeసినిమా'ఆర్ఆర్ఆర్' టీమ్ లో కనిపించని దానయ్య. అసలు ఏం జరిగింది..?

‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లో కనిపించని దానయ్య. అసలు ఏం జరిగింది..?

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కనిపిస్తున్నారు కానీ.. వందల కోట్లు పెట్టి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నిర్మించిన నిర్మాత దానయ్య ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు ఇంట్రస్ట్ లేదనుకున్నా.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించిన దానయ్య గురించి రాజమౌళి చెప్పాలి కదా.. ఆయన ఎక్కడా దానయ్య ప్రస్తావన తీసుకురావడం లేదు. దీంతో రాజమౌళి, దానయ్య మధ్య ఏదైనా గొడవ జరిగిందా..? అసలు ఏం జరిగింది..? అనేది ఆసక్తిగా మారింది.

ఆర్ఆర్ఆర్ టీమ్ లో నిర్మాత దానయ్య కనిపించకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మేటర్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ మూవీని ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి 50 కోట్లు ఖర్చు అవుతాయని రాజమౌళి, దానయ్యతో చర్చించారట. అయితే.. ఈ విషయమై దానయ్య అంతగా ఇంట్రస్ట్ చూపించలేదట. దీంతో రాజమౌళినే స్వయంగా తన డబ్బుతో ఆర్ఆర్ఆర్ మూవీ విదేశాల్లో ప్రచారం చేస్తున్నారని టాక్. జపాన్, రష్యాల్లో విడుదలకు సంబంధించి వచ్చిన ఆదాయాన్ని ఇటు మళ్లించేట్లుగా ఒప్పందం ఏదో కుదిరిందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఒక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి ప్రచారం చేయడానికే 17 కోట్లు ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ మూవీని విదేశాల్లో ప్రచారం చేయడం కోసం దాదాపు 65 నుంచి 70 కోట్ల మేరకు అయిందని తెలుస్తోంది. మొత్తం మీద తొలిసారి ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికల మీద హడావుడి చేయడానికి ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం జరుగుతోందనుకోవాలి. అయితే.. ఇక్కడ రాజమౌళికి నష్టం లేదు. ఎందుకంటే మహేష్ తో చేసే సినిమాను అంతకు అంతా మార్కెట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం అంతా అక్కడ రాబట్టేయవచ్చు. రాజమౌళి థింకింగ్ మామూలుగా ఉండదుగా..

Also Read : ఎన్టీఆర్ గురించి క్లారిటీ ఇచ్చిన హెచ్సీఏ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular