సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నారాయాణ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేంద్ర కేబినెట్‌లో నేరస్థులున్నారని ఆరోపించారు. జార్ఖండ్ సీఎం హేమంత సోరెన్ ను పదవి నుంచి తప్పించాలని కేంద్రం శత విధాల ప్రయత్నించిందని ఆరోపించారు. మోదీ పాలనలో దేశం అధోగతి పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిలిసై బిజెపి నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ఆమెకు సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని… తెలంగాణ గవర్నర్ ను వెంటనే రికాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని… నిలదీసే ప్రత్యర్థులపై ఈడీ తో దాడులకు పురిగొల్పి భయాందోళనలకు గురి చేస్తుందని బిజెపి నాయకత్వంపై మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నండునే లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించాలని చూశారని వెల్లడించారు. అదాని ఒకప్పుడు స్మగ్లర్ అని అలాంటి వ్యక్తికీ బిజెపి కొమ్ము కాస్తోందని విమర్శించారు. దేశాన్ని దోచుకుంటున్న అదానీ జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఐక్యం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.
Also Read : రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారింది: తమిళి సై