Friday, March 13, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్.. టిక్కెట్ల బుకింగ్ లో సరికొత్త రికార్డ్

ఆర్ఆర్ఆర్.. టిక్కెట్ల బుకింగ్ లో సరికొత్త రికార్డ్

Records before release: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ మూవీ టీజ‌ర్, సాంగ్స్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇప్పుడు అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే… గతంలో మొదటి రిలీజ్ డేట్ కే ఈ భారీ సినిమా ఫిక్స్ కాగా ఓవర్సీస్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసినపుడు రికార్డు స్థాయి బుకింగ్స్ ని ఈ చిత్రం నమోదు చేసుకుంది. మరి అప్పుడు వాయిదాపడి మళ్ళీ ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఇప్పుడు అంతకు మించిన‌ లెవెల్లో బుకింగ్స్ నమోదు అవుతున్నాయని స‌మాచారం. ఆశ్చర్యకరంగా ఈ చిత్రం కేవలం 4 గంటల్లోనే 2 లక్షలకి పైగా డాలర్స్ బుకింగ్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఇది మాత్రం మామూలు సెన్సేషన్ కాదని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకి ఈ రేంజ్ లో బుకింగ్స్ జ‌ర‌గ‌లేద‌ట‌. ఈవిధంగా ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల బుకింగ్ లోను స‌రికొత్త రికార్డ్ సాధించింది అంటున్నారు మేక‌ర్స్. ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ నాటికి బుకింగ్స్ ఎలా ఉంటాయో.. ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేస్తుందో అనేది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular