Saturday, November 23, 2024
HomeTrending Newsభద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గొదావరి ఉదృతి మంగళవారం కొంత మేర తగ్గింది. నిన్న సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రస్తుతం దానిని ఉపసంహరించారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో బస చేసి అటు అధికారులను అప్రమత్తం చేస్తూనే అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఅర్ కు ఫోన్ ద్వారా పరిస్థితులను వివరిస్తున్నారు.

ఈ రోజు (మంగళవారం) ఉదయం గొదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆనంతరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికి అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్య అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతానికి ప్రమాదం లేనప్పటికీ అధికార యంత్రాంగం మరో 24గంటలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ.. బ్లీచింగ్ శానిటేషన్ చేయలని మంత్రి అదేశించారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు మరింత ఉధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపద్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

మంత్రి వెంట జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ , జిల్లా ఎస్పి వినీత్  మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్