Sunday, September 8, 2024
Homeసినిమానాగ్ సినిమాని అనౌన్స్ చేసేది ఎప్పుడు..?

నాగ్ సినిమాని అనౌన్స్ చేసేది ఎప్పుడు..?

నాగార్జున ఎప్పుడూ లేనంతగా నెక్ట్స్ మూవీ విషయంలో ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ అంటూ యాక్షన్ మూవీస్ చేశారు కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన బంగార్రాజు మాత్రం సక్సెస్ అయ్యింది. అయితే.. యాక్షన్ మూవీస్ చేస్తుంటే చూడడం లేదు కాబట్టి ఎలాంటి సినిమా చేయాలని గత కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నారు. అదిగో అనౌన్స్ మెంట్… ఇదిగో అనౌన్స్ మెంట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. కొత్త సినిమా కబురు మాత్రం రావడం లేదు.

దర్శకుడు దశరథ్ నిర్మాతగా మారి లవ్ యు రామ్’ అనే సినిమాను నిర్మించాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సాంగ్ ను నాగార్జునతో విడుదల చేయించారు. అయితే… నాగార్జున ఈ సాంగ్ రిలీజ్ చేసిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో నాగార్జున లాంగ్ హెయిర్ తో చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. గెడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇదంతా తను చేయబోయే సినిమా లుక్ కోసం అని అనిపిస్తుంది. జూన్ ఫస్ట్ వీక్ లోనే కొత్త సినిమాను ప్రకటిస్తారని టాక్ వినిపించింది కానీ.. ఇంకా ప్రకటించలేదు.

ఏది ఏమైనా ఈ నెలలో కొత్త సినిమా గురించి ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. బెజవాడ ప్రసన్న తో సినిమాను అలా ఉంచి ఈమధ్య కొన్ని కథలు విన్నారట. ఈ కథల్లో ఏ కథ కూడా మెప్పించలేదట. అందుచేత బెజవాడ ప్రసన్నతోనే సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ నెలాఖరులోపు ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని.. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయలి అనేది ప్లాన్. మరి.. నాగ్ సంక్రాంతి ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్