Saturday, March 14, 2026
Homeసినిమా‘రెక్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

‘రెక్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

Rekki started: స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ; ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యూనిక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా… క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, అమీక్ష, భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు.

క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాoశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న ‘రెక్కీ’ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

Also Read : 27న జెమిని కిరణ్ చేతుల మీదుగా ‘రెక్కీ’ ఫస్ట్ లుక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular