Sunday, January 19, 2025
HomeTrending Newsదళితబంధు పూర్తి నిధులు విడుదల

దళితబంధు పూర్తి నిధులు విడుదల

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది.
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం , నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.
పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది.
సిఎం కెసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు అమలు చేయడమే మిగిలింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల వివరాలు
తేదీ 9.8.21 నాడు రూ. 500కోట్లు
23.08.2021 నాడు రూ. 500 కోట్లు
24.08.2021 నాడు రూ. 200 కోట్లు
25.08.2021 నాడు రూ. 300 కోట్లు
26.08.2021 (నేడు) రూ. 500 కోట్లు…
…మొత్తం రూ. 2000 కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్