Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రఘురామ పిటిషన్ డిస్మిస్

రఘురామ పిటిషన్ డిస్మిస్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డిలకు సిబిఐ  కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను నేడు కోర్టు కొట్టివేసింది. సిఎం జగన్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.

బెయిల్ రద్దు పిటిషన్లు మరో బెంచ్ కు బదిలీ చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నేటి ఉదయం కొట్టివేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు..  బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్