Sunday, January 19, 2025
Homeసినిమాకొరటాల సమర్పణలో సత్యదేవ్ సినిమా

కొరటాల సమర్పణలో సత్యదేవ్ సినిమా

విభిన్న పాత్రలు పోషిస్తూ.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుకున్నాడు సత్యదేవ్. జ్యోతిలక్ష్మి, మన ఊరి రామాయణం, బ్లఫ్ మాస్టర్, 47 డేస్.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఈ రోజు (జులై 4) సత్యదేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సత్యదేవ్ కొత్త సినిమాను ప్రకటించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఈ నిర్మాత సాయి ధరం తేజ్ – మెహ్రీన్ జంటగా జవాన్ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ద్వారా గోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. స్టార్ హీరోలతో సినిమాలు చేసే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించడానికి కారణం ఏంటంటే.. ఈ చిత్ర దర్శకుడు గోపాల్, నిర్మాత కృష్ణ.. ఈ  కథ ఎలా ఉందో ఒకసారి విని అభిప్రాయం చెప్పమని కొరటాల శివను సంప్రదించారట. కథ విన్న కొరటాల, చాలా బావుందని చెప్పడంతో పాటు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తానని చెప్పారట. అలా.. కొరటాల ఈ సినిమాలోకి రావడం జరిగిందని సమాచారం. సత్య దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్