Saturday, November 23, 2024
HomeTrending Newsప్రముఖ కథా రచయిత శ్రీ రమణ కన్నుమూత

ప్రముఖ కథా రచయిత శ్రీ రమణ కన్నుమూత

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు మృతి విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే చిత్ర రంగంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, వ్యంగ్య వ్యాసకర్త శ్రీ రమణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన… ఈ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 ఏళ్లు.

జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ రమణ టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించారు.  బాపు, రమణలతో పాటు పలువురు దర్శకులతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా పేరడీ రచనలకు  ఆయన  ఫేమస్‌.  ‘నవ్య’ వారపత్రికకు ఎడిటర్‌గానూ పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా శ్రీ రమణకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి  కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ‘పత్రిక’ అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. కాలమిస్టుగా, కథకుడిగా, సినీ రంగంలో నిర్మాణ నిర్వహణ పరంగా ఆయన పేరుగాంచారు. ఇదే సమయంలో సాహిత్య, కళారంగాల్లో తనదైన సేవ చేశారు. శ్రీరమణది గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు,  సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్