Sunday, March 16, 2025
HomeTrending NewsHome Ministry: జోన్ల పునర్వ్యవస్థీకరణపై హోం మంత్రి సంతకం

Home Ministry: జోన్ల పునర్వ్యవస్థీకరణపై హోం మంత్రి సంతకం

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నూతన సచివాలయంలోని మొదటి ఫ్లోర్ లో ఆదివారం రెండు గంటల ప్రాంతంలో ఆసీనులయ్యారు. ప్రార్థనల అనంతరం బాధ్యతలు చేపట్టిన హోం మంత్రి మొదటగా మూడు కమిషనరేట్ల పరిధిలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు ఫైల్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, బ్రాహ్మణులు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రతినిధులు హోం మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, డిజిపి అంజనీ కుమార్, ఏసీబీ డీజీపీ రవి గుప్తా, కమిషనర్లు సివి ఆనంద్ (హైదరాబాద్), డి ఎస్ చౌహన్ ( రాచకొండ) స్టీఫెన్ రవీంద్ర (సైబరాబాద్), అడిషనల్ డీజీపీలు సందీప్ శాండిల్య, శిఖా గోయల్, మహేశ్ ఎం భగవత్, స్వాతి లక్రా, నాగిరెడ్డి, ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి డి ఐ జిలు ( పి& ఎల్) రమేష్ రెడ్డి, రమేష్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్