Saturday, January 18, 2025
HomeTrending Newsజగన్ తో భేటీ కానున్న చిరంజీవి, నాగార్జున

జగన్ తో భేటీ కానున్న చిరంజీవి, నాగార్జున

Chiranjeevi, Nagarjuna to meet CM: ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున సమావేశం కానున్నారు. వీరితో పాటు త్వరలో విడుదల కానున్న భారీ చిత్రాల నిర్మాతలు దానయ్య, యూవీ క్రియేషన్స్ వంశీ లు కూడా సిఎం ను కలుస్కునే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని నేడు సిఎం జగన్ ను కలుసుకున్నారు. సినిమా టిక్కెట్ రేట్ల సవరణ, ఇతర సినీ పరిశ్రమ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా సినీ ప్రతినిధులతో ఏయే అంశాలపై ప్రభుత్వ పరంగా హామీ ఇవ్వాలనే అంశాలను చర్చించారు. సినిమా థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పనపై కూడా చర్చ జరిగింది. టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ముఖ్యాంశాలను నాని సిఎంకు వివరించారు. రేపు మరో సారి సీఎం జగన్‌తో పేర్ని నాని భేటీ కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్