Saturday, March 14, 2026
HomeTrending NewsHMDA: చివరి రోజు మోకిలలో అదే ఊపు

HMDA: చివరి రోజు మోకిలలో అదే ఊపు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లు, ఫేజ్-2 లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్ లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడుపోయాయి. ముందు నుంచి హెచ్ఎండిఏ మోకిల వెంచర్ లో ప్లాట్ల కొనుగోలు కోసం ఔత్సాహికులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్లను ఆన్ లైన్ (ఈ-ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 350 ప్లాట్లకు గాను 346 ప్లాట్లు అమ్ముడుపోయి మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఫేజ్ -2లో మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడవరోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మంగళవారం నాలుగవ రోజు రూ.102.73 కోట్ల రెవెన్యూ చేకూరింది.

మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం ఎంతో మంది పోటీపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular