Sunday, September 8, 2024
HomeTrending NewsTelangana Martyrs: 22న అమరుల స్మారక చిహ్నం ప్రారంభం

Telangana Martyrs: 22న అమరుల స్మారక చిహ్నం ప్రారంభం

సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు..హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి,డిజిపి అంజనీ కుమార్ లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈనెల 22న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు రోజున “తెలంగాణ అమరుల స్మారక చిహ్నం” ముఖ్యమంత్రి కేసిఆర్ ఆవిష్కరిస్తారని  తెలిపారు. అందుకు సంబంధించిన ప్రోగ్రాం రూట్ మ్యాప్,తదితర ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలు,ఈ సందర్బంగా నిర్వహించే సభ,అతిథులకు ఏర్పాట్లు,పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సి దేశపతి శ్రీనివాస్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సి గణపతి రెడ్డి,ఐ అండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి,ఆర్ అండ్ బి ఎస్.ఈ హఫీజ్,ఈ.ఈ నర్సింగరావు,బాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పలువురు పోలీసు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్