Monday, January 20, 2025
HomeTrending Newsర్యాలంపాడు పనుల్లో అధికారుల అలసత్వం

ర్యాలంపాడు పనుల్లో అధికారుల అలసత్వం

Review On Gadwal Irrigation Projects :

గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ , ప్రాజెక్టు పనులను ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, అలoపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంతో కలిసి రిజర్వాయర్ సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో స్మితా సబర్వాల్ మాట్లాడుతూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించటం సరికాదన్నారు. గద్వాల ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులు రిజర్వాయర్లను పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ సెంటర్ ల గురించి కూడా పురోగతి జరిగిన విధానం, ప్రాజెక్టులోని ప్రధాన సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డ స్మితా సబర్వాల్,అధికారుల పనితీరుపై రోజువారీ నివేదికలు ప్రభుత్వానికి సూచించాలని కోరారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్ లను పూర్తిగా నిర్మాణం చేసి పెండింగ్లో ఉన్న గ్రామాలలోని పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామంలో పూర్తి చేసి ఆ గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించి మరే గ్రామంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులను సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ….

గద్వాల ప్రాంతం నడిగడ్డ ఇటు కర్ణాటక,అటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు ఇక్కడి తరలివచ్చి పనులు చేస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వంలో ఈ ప్రాంతం సస్యశ్యామలం గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయిస్తామన్నారు. మధ్యలో వదిలేసిన పనులను వేరే గుత్తేదారుకు అప్పజెప్పి పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సిఎంఓడి అధికారి, మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో మరో గోదావరిని తలపించేలా ఈ ప్రాంతాన్ని తీర్చిద్దుతామన్న విశ్వాసంతో కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం జరుగుతుందన్నారు . 45 రోజుల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నోనిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.

Also Read : డ్రగ్స్ నియంత్రణకు కౌంటర్ ఇంటెలిజెన్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్