Sunday, January 19, 2025
HomeTrending Newsరేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు

రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు

రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టని, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉందని రేవంత్ రెడ్డిని పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టెంట్ ,స్టంట్ ,ప్రెసెంట్ ,ఆబ్సెంట్ అన్నట్టుగా రేవంత్ రాజకీయం నడుస్తోందన్నారు. టీ ఆర్ ఎస్ ఎల్ పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో జీవన్ రెడ్డి రేవంత్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రేవంత్ తొక్కుతా అంటున్నాడు ..వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న టీ ఆర్ ఎస్ తలుచుకుంటే నిన్ను ఎంత తొక్కగలమో ఆలోచించుకోవాలన్నారు.

రేవంత్ తీరుపై సోనియా ,రాహుల్ కు ట్విట్టర్ లో లేఖ రాశానని, రేవంత్ భాష గురించి రాహుల్ కు తెలుసా ? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర శివ సేన ప్రభుత్వం లో కాంగ్రెస్ ఉందని, నారాయణ్ రాణే ను ఒక్క మాటకే అక్కడ మీ ప్రభుత్వం అరెస్టు చేసింది ..మరి అంత కన్నా ఎక్కువ మాట్లాడుతున్న రేవంత్ ను ఏం చేయాలో వాళ్ళే చెప్పాలి. ఒక్క మల్లారెడ్డి- మైనంపల్లి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని, వందమంది ఎమ్మెల్యేలు ఉన్నాం మాట్లాడితే తట్టుకోలేరు.మేము తొక్కితే ఎంత లోతు వెళ్తావన్నారు.

రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయడం చివరి అస్త్రం. లేఖ తరువాత అయినా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి. థర్డ్ క్లాస్ మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అదే ప్రగతి భవన్ స్థలం నుంచే పాలన చేశారు కదా? అప్పుడు ఎందుకు బహుజన భవన్ పేరు పెట్టలేదన్నారు. రేవంత్ ది ఈవెంట్ మేనేజర్ తప్ప పీసీసీ అధ్యక్షుడి స్థాయి కాదన్నారు. రేవంత్ చర్యలు దుర్మార్గాలు శృతి మించితే ఏం చేయాలో మాకు తెలుసన్న జీవన్ రెడ్డి కెసిఆర్ ను డీ కొట్టే స్థాయి రేవంత్ ది కాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్