Monday, March 16, 2026
HomeTrending Newsమోసం,దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం

మోసం,దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం

కేటీఆర్ (KTR) కాదు ఆయన కెడిఆర్ (KDR) అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి హరీష్ బతుకు కూడా కాంగ్రెస్ భిక్ష అని, కాంగ్రెస్ హయాంలో మంత్రి అయ్యాడన్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు. KCR బతుకు టీడీపీ భిక్ష… KCR బతుకు స్టార్ట్ అయ్యిందే బిచ్చగాడిలా అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ సోనియా గాంధీ కాళ్ళు మొక్కి పార్టీని విలీనం చేస్తా అని మోసం చేసాడని విమర్శించారు.

మోసానికి,దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం అన్న రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం బ్లడ్ గ్రూప్ మోసం,దోపిడీ అన్నారు. ఈ రోజు ఎల్ రమణ ను టీడీపీ నుండి తీసుకుంటున్నారని, నక్క పులితోలు కప్పుకొని బతుకున్నట్టు ఉంది టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కన్నారవు తండ్రి రంగారావు కుటుంబాన్ని తొక్కి కేసీఆర్ పైకి వచ్చాడని, టీఆర్ఎస్ పార్టీలో మొత్తం టీడీపీ నాయకులే ఉన్నరన్నారు.

కేసీఆర్ చంద్రబాబుకు చెప్రాసీ  లా పనిచేశాడని, నా దగ్గర టీడీపీ వాసన ఉంది అంటున్నారు బావ బామ్మర్దులు …మీ దగ్గర కొట్టే మందు కంపు కంటే ..టీడీపీ వాసన మంచిదేనని రేవంత్ అన్నారు. అధికారాన్ని బరాబర్ తన్ని  గుంజుకుంటామని స్పష్టం చేశారు. సమస్య తీవ్రతను బట్టి పాదయాత్ర ఉంటుందని, ఎప్పుడనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ప్రపంచానికి అధిపతిని అయ్యిన సంతోషం నాకు వచ్చింది..నీకు ఎమ్ నొప్పి KTR అని రేవంత్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular