కొద్దిసేపట్లో షామీర్ పేట కట్ట మైసమ్మ దేవాలయానికి చేరుకోనున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మూడు చింతలపల్లికి చేరుకన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మూడు చింతలపల్లిలో రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేత్కర్ విగ్రహానికి, మాజీ సమితి అధ్యక్షులు వీరారెడ్డి ల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి. అక్కడ నుంచి భారీ ప్రదర్శనగా దీక్షా సభా స్థలికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. ఆయనతో పాటు వేలాది మంది నాయకులు, కార్యకర్తలు దీక్షలో ఉంటారు.