వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాటి నుంచి నేటి వరకు వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అయితే.. ఆయన సినిమాల రిలీజ్ కి ముందు హడావిడి ఉంటుంది కానీ.. విడుదల తర్వాత ఎలాంటి ఎలాంటి హడావిడి ఉండదు. ఈమధ్య కాలంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, పవర్ స్టార్, వంగవీటి, కొండా ఇలా పొలిటికల్ ఫిల్మ్స్ తీశారు. తాజాగా ‘వ్యూహం‘ అంటూ రాజకీయ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముందుగా ఒక సినిమాగానే తీయాలి అనుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. రెండు పార్టులుగా తీస్తున్నారు.
వ్యూహం ఫస్ట్ పార్ట్ ను నవంబర్ 10న విడుదల చేస్తున్నారు. రెండో పార్ట్ ను జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. వ్యూహం ఫస్ట్ పార్ట్ రిలీజ్ సందర్భంగా.. థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో వర్మ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ముఖ్యంగా వరుసగా పొలిటికల్ ఫిల్మ్స్ చేస్తున్నారేంటి అని అడిగితే.. ఇక నుంచి పొలిటికల్ ఫిల్మ్స్ తీయను అని చెప్పారు. వ్యూహం సినిమానే తన నుంచి వచ్చే లాస్ట్ పొలిటికల్ మూవీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. జనరల్ గా వర్మ తను చెప్పిన మాట మీద నిలబడరు.
ఇదే విషయం గుర్తు చేస్తే.. అవును.. నిజమే మాట మీద నిలబడను కానీ.. ఈసారి మాత్రం.. ఈ విషయంలో ఖచ్చితంగా మాట మీద నిలబడతాను అని చెప్పడం విశేషం. అలాగే మీకు డబ్బులు ఇచ్చి ఏపీ సీఎం వై.ఎస్ జగన్ కు వ్యతిరేకంగా సినిమా చేయమంటే తీస్తారా..? అని అడిగితే.. తీయను అని చెప్పారు. ఇలా జర్నలిస్టులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు వర్మ్ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. మరి.. వ్యూహం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.