Saturday, January 18, 2025
Homeసినిమా“కళామతల్లి చేదోడు" - సినీ కార్మికులకు చేయూత.

“కళామతల్లి చేదోడు” – సినీ కార్మికులకు చేయూత.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్, డ్రైవర్స్, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్ గారు,అజయ్ కుమార్ , వల్లభనేని అనిల్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు,

ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్ మాట్లాడుతూ.. ప్రస్తుత కష్ట కాలంలో ప్రతి పేద సినిమా కార్మికుడు, కార్మికురాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరినీ ఆదుకోవాలని “కళామతల్లి చేదోడు” కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ వున్నారు. ఇప్పుడు వారందరికీ ఓకేసారి వస్తువులు పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి కోవిడ్ కారణాల దృష్ట్యా మొదటగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మందికి పేద కార్మికులకు పంపిణీ చేశాం మిగిలిన వారందరికీ కూడా దశల వారీగా అందిస్తాం’’ అని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్