Sunday, January 19, 2025
Homeసినిమా“రిచి గాడి పెళ్లి” ఫస్ట్ లుక్ విడుదల

“రిచి గాడి పెళ్లి” ఫస్ట్ లుక్ విడుదల

కేస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై  నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులుగా కెఎస్ హేమరాజ్ దర్శకత్వంలో  వస్తున్న “రిచి గాడి పెల్లి” టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు.

దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ…“జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశ-దిశ-గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్, ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. ఈ చిత్రం యొక్క మరిన్ని వివరాలను త్వరలో విడుదల చేస్తాం” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్