Tuesday, January 21, 2025
HomeTrending Newsకేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జెడి) ముఖ్యనేత, బీహార్ ప్రతిపక్ష నేత… తేజస్వీ ప్రసాద్ యాదవ్… ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. తేజస్వీ యాదవ్ తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునిల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తదితరులున్నారు.

ఈ సందర్భంగా నేతలిద్దరూ జాతీయ రాజకీయాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. బిజెపి, ఎన్.డి.ఏ కూటమి దూకుడు, రాజకీయ కక్షసాదింపులు, మతోన్మాద శక్తులను నిలువరించే అంశాలు, జాతీయ రాజకీయాల్లో వామపక్షాలను కలుపుకొని పోయే విధానంపై నేతలు సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు, ఎంపి జోగిన్ పల్లీ సంతోష్ రావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్