Sunday, January 19, 2025
HomeTrending Newsదేశం గర్వపడేలా జగన్ పాలన: రోజా

దేశం గర్వపడేలా జగన్ పాలన: రోజా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశం గర్వపడేలా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. నవరత్నాలతో ప్రతి పేదవాని ఇంట వెలుగులు విరజిమ్ముతున్నాయని, ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించే సిఎంగా జగన్ తోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఆదివారం ఆస్ట్రేలియాలో వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నారైల సమావేశంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

రోజా మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి నాయకుడంటే ఇలా ఉండాలని జగన్ మోహన్ రెడ్డి నిరూపించారన్నారు. ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా జగనన్న పాలిస్తున్నారు అన్నారు. దేశం కోసం యుద్ధం చేస్తే అతను సైనికుడు అని, ధర్మం కోసం యుద్ధం చేస్తే అతను రాముడని, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే అతను నాయకుడని, అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తాను ప్రవేశపెట్టిన అర్హులైన అందరికీ అవుతుందా అని తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. దీంతో పేద ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతోందన్నారు.

విదేశీ చదువులకు కూడా విదేశీ విద్య దీవెన ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగనన్న అన్నారు. ఆయనతోపాటు ఆయన స్థాపించిన పార్టీలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. 2024 లోను ఇలాంటి జనరంజకమైన పాలన కొనసాగడానికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.  పచ్చ ఛానల్స్, పచ్చ మీడియాను తలదన్నేలా సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భరత్, బ్రహ్మారెడ్డి, రామంజి, మణిదీప్, తరుణ్, సతీష్ పాటి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్