Friday, March 20, 2026
Homeసినిమారొమాంటిక్ కామెడీ ‘సరసాలు చాలు’ ప్రారంభం

రొమాంటిక్ కామెడీ ‘సరసాలు చాలు’ ప్రారంభం

romantic entertainer: సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న  ‘సరసాలు చాలు’  చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో జరుపుకుంది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేయగా..చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి  హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు. నిర్మాత చంద్రకాంత్ రెడ్డి, రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘లూజర్’ వెబ్ సిరీస్  దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

బి.చంద్రకాంత్ రెడ్డి  మాట్లాడుతూ “చిన్నప్పటి నుండి  సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో  సందీప్ చెప్పిన కథ నచ్చి ఈ మూవీ చేస్తున్నాను రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాము. ఇక ముందు మా బ్యానర్లో ఇలాంటి మంచి సినిమాలు చేస్తాం” అన్నారు.

సందీప్ చేగూరి మాట్లాడుతూ “ఒక చిన్న విరామం సినిమా తర్వాత వస్తున్న నా రెండవ సినిమా “సరసాలు చాలు” పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ బ్రీజి ఎంటర్ టైనర్. కామెడీ కు ఇంపార్టెంట్ ఇస్తూ సాగే ఫుల్ కామెడీ క్లిన్ ఎంటర్ టైనర్ గా  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఇందులో కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం” అన్నారు.

Also Read : ఎల్లుండి ‘లా లా భీమ్లా డిజే వెర్షన్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular