Wednesday, March 11, 2026
Homeసినిమారోషన్ పాన్ ఇండియా మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రోషన్ పాన్ ఇండియా మూవీ ఫిక్స్ అయ్యిందా..?

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమాతో నటుడుగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు. విభిన్న కథాంశంతో రూపొందిన నిర్మలా కాన్వెంట్ రోషన్ కు నటుడుగా మంచి పేరు తీసుకువచ్చింది. ఆతర్వాత కొంత గ్యాప్ తర్వాత రోషన్ పెళ్లిసందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. నూతన దర్శకురాలు గౌరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రోషన్ తొలి సినిమాతోనే నటుడుగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించాడు.

రోషన్ కు నటనలో మంచి ఈజ్ ఉండడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అయితే.. వచ్చిన ఆఫర్స్ అన్నింటికి ఓకే చెప్పకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పెళ్లి సందడి తర్వాత ఇంకా సినిమా ప్రకటించలేదు. మరి.. విషయం ఏంటంటే.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడట. కన్నడ డైరెక్టర్ నంద కిషోర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా నటించనున్నారని సమాచారం. ఇందులో మోహన్ లాల్, రోషన్ తండ్రీకొడుకులుగా నటించనున్నారని.. ఇదొక పిరియాడికల్ ఎమోషనల్ డ్రామా అని తెలిసింది.

పాన్ ఇండియా మూవీగా రూపొందించే ఈ చిత్రాన్ని ఈ నెలలోనే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకి కూడా రోషన్ ఓకే చెప్పాడట. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడని.. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా పరిచయం కానున్నాడని తెలిసింది. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రమని… త్వరలో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular