Sunday, March 15, 2026
Homeసినిమా‘ఆర్.ఆర్. మూవీస్’ వెంకట్ ఇక లేరు

‘ఆర్.ఆర్. మూవీస్’ వెంకట్ ఇక లేరు

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె .వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు. కొన్ని రోజుల నుంచి ఆయ‌న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట్ వయసు 57 సంవత్సరాలు.

తెలుగులో ది ఎండ్ , సామాన్యుడు , మాయాజాలం ,హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమ కావాలి, డాన్ శ్రీను, పైసా, ఢమరుకం, బిజినెస్ మెన్, లవ్లీ, విక్టరీ, ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు. వెంకట్ ప్రతి సినిమా విడుదల సందర్భగా సేవా సంస్థలకు ఐదు లక్షల రూపాయలను అందించేవారు. సినిమా అంటే ఎంతో మక్కువ వున్న వెంకట్ ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు. తెర వెనుక వుండే వెంకట్ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. వెంకట్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular