Sunday, January 19, 2025
Homeసినిమావెయ్యి కోట్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఆర్ఆర్ఆర్

వెయ్యి కోట్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఆర్ఆర్ఆర్

Thousand Crores: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. టాక్ డివైడ్ గా వ‌చ్చిన‌ప్ప‌టికీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ మాత్రం రికార్డు స్థాయిలో వ‌స్తుండ‌డం విశేషం. ఫ‌స్డ్ డేనే అన్ని ఏరియాల్లో స‌రికొత్త రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ 1000 కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో మేక‌ర్స్ స్పందిస్తూ.. ఒక ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల వసూళ్లు అనేది ఒక కల లాంటిది కానీ.. మేము మా బెస్ట్ గా ప్రయత్నం చేశాం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కి, తమ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన 1000 కోట్ల పోస్ట‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

Also Read : మ‌రోసారి వార్త‌ల్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్