ఆర్ఆర్ఆర్.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చూపించింది. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
ఇటీవల ఈ మూవీ జపాన్ లో రిలీజైంది. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి.. జపాన్ లో బాగా ప్రచారం చేశారు. దీంతో అక్కడకూడా ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే బాహుబలి వసూళ్లను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసింది. బాహుబలి 3000 మిలియన్ యోన్ లు సాధించగా ఆర్ ఆర్ఆర్ 4000 మిలియన్ యోన్ లు సాధించి తెలుగు సినిమా పేరిట ఉన్న పాత రికార్డును చెరిపేసి కొత్త రికార్డు నమోదు చేసింది.