RRR Run time: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించడంతో సామాన్య ప్రేక్షకులు సైతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 25న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ కంప్లీట్ అవ్వడంతో రన్ టైమ్ ఎంత అనేది బయటకు వచ్చింది. ఇంతకీ ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ ఎంతంటే.. 3 గంటల 6 నిమిషాల 54 సెకన్‌లు. రాజమౌళి గత చిత్రం బాహుబలి ది కంక్లూజన్ రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలు. ఇప్పుడు బాహుబలి – 2 సినిమా కంటే ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ ఎక్కువగా ఉండటం విశేషం. ఆర్ఆర్ఆర్.. బాహుబలి 2 వలే చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.