Monday, March 9, 2026
Homeసినిమాఇట్స్ అఫిషియ‌ల్.. ఆర్ఆర్ఆర్ వాయిదా

ఇట్స్ అఫిషియ‌ల్.. ఆర్ఆర్ఆర్ వాయిదా

RRR-Stay Tune: ఆర్ఆర్ఆర్..  సినీ అభిమానులు అంద‌రూ ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్న సినిమా. బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించిన సినిమా కావ‌డం.. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో ఆర్ఆర్ఆర్ సినిమా పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్పడ్డాయి. జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల అని ప్రక‌టించారు.

దేశ వ్యాప్తంగా ప్ర‌మోష‌న్ చేశారు. అయితే..రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం.. కొన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్లు మూత‌ప‌డుతుండ‌డంతో ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రక‌టించారు. ఎంతో కష్టపడి పని చేసినా, కొన్ని పరిస్థితులు తమ చేయి దాటిపోయాయని పేర్కొంది. దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదలను వాయిదా వేయటం తప్ప తమకు మరో మార్గం కనిపించలేదని చిత్ర బృందం తెలిపింది. మ‌రి.. ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌నేది ప్రక‌టించ‌లేదు కానీ.. ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular