Wednesday, March 18, 2026
Homeసినిమా‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ లో రావడం లేదా?

‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ లో రావడం లేదా?

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే.. రాజమౌళి  అనౌన్స్ చేసినప్పటికీ.. చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం కష్టమే అంటూ వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.

ఇప్పుడు ఆ వార్తలే నిజం కానున్నాయని టాక్ వినిపిస్తోంది. అవును.. ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడనుందని సమాచారం. రాజమౌళి ఉక్రెయిన్ లో పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని  వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. ఆతర్వాత కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని తెలిసింది. అయితే..  అక్టోబర్ కు రిలీజ్ వాయిదా పడితే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది కానీ.. రాజమౌళి సంక్రాంతి సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. క్రిస్మస్ కానీ.. రిపబ్లిక్ డే కి కానీ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలనుకుంటున్నట్లు తాజా సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular