Who Benefit: ‘ఆర్ఆర్ఆర్‘.. ఇప్పుడు సినీ అభిమానులు ఎవరి నోట విన్నా ఇదే మాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదలకు రెడీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేశాయి.
దీంతో రికార్డు స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడమే కాదు.. ప్రీమియర్స్ కూడా రికార్డు స్థాయిలో వేస్తుండడం విశేషం. హైదరాబాద్‌లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్‌లు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 25న ఉదయం 1 గంటకు ఈ స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ లు ప్రారంభమవుతాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రీమియర్ షోలను కోటి రూపాయలకు విక్రయించారని సమాచారం. హైదరాబాద్లోని భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, అర్జున్, శ్రీరాములు, విజేత థియేటర్లలో ఉదయం 1 గంటకు స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.
వలిమై చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన ప్రముఖ ఓవర్శిస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్నమూరి గోపీచంద్ భారీగా చెల్లించి ప్రీమియర్ షోలను సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ స్పెషల్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ ప్రత్యేక ప్రీమియర్ల టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లో రెగ్యులర్ షోలు అన్ని థియేటర్లలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిసింది. అందుచేత.. కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతోన్న ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: నేను మీ నాన్నకు ఫ్యాన్ ను : అమీర్