Saturday, November 23, 2024
Homeసినిమాదూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్ ఎత్త‌ర జెండా పాట‌

దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్ ఎత్త‌ర జెండా పాట‌

Yettara jenda:  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. సినీ అభిమానులంద‌రూ ఎప్పుడెప్పుడు ఆర్ఆర్ఆర్ వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచింది. ఇందులో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని విడుదల చేస్తామని ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహం పెంచారు.

దానికి సంబంధించి రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాతో కూడిన ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. సినిమా చివర్లో.. ఎత్తర జెండా పాటను చూపించి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాం. కాకపోతే.. మా సంతోషాన్ని త్వరగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సెలబ్రేషన్‌ ఆంథమ్ ని ఈనెల‌ 14న విడుదల చేస్తున్నాం. ఈ పాటతో కౌంట్‌డౌన్‌ని ప్రారంభిద్దాం అని రాజమౌళి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే.. ఈ పాట‌ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. సాంకేతిక కార‌ణాల వ‌ల‌న రేపు అన‌గా మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఆ త‌ర్వాత ఏమైందో కానీ.. ఈరోజు రాత్రి 7 గంట‌ల‌కు ఈ పాట‌ను రిలీజ్ చేశారు. పరాయి పాలనపై కాలు దువ్వి.. కొమ్ములు విధిలించిన కోడి గిత్తల్లాంటి అమరవీరులను తలచుకుంటూ…అంటూ రాజమౌళి వాయిస్‌తో ప్రారంభమైందీ పాట. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌ను ర‌చించ‌గా.. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందించారు. విశాల్‌ మిశ్రా, పృథ్వీ చంద్ర, కీరవాణి, సాహితి చాగంటి, హరికా నారాయణ్‌ ఆలపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా కలిసి వేసిన స్టెప్‌లు సూప‌ర్ అనేలా ఉన్నాయి. దీంతో ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్