Tuesday, March 17, 2026
Homeసినిమా20న  'ఆర్ఆర్ఆర్' వరల్డ్ డిజిటల్ ప్రీమియర్

20న  ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్

RRR premier:  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్‘. మే 20వ తేదీన ‘జీ 5’ ఓటీటీ వేదికలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై 50 రోజులు. మే 20వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా! ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెర పైకి త్రిబుల్ ఆర్ సినిమాను జీ5 ఓటీటీ వేదిక తీసుకొస్తుందని చెప్పవచ్చు. 4k క్వాలిటీ, డాల్బీ డీటీఎస్ లో ప్రేక్షకులు సినిమాను చూడవచ్చు. TVOD పద్ధతిలో వీక్షకులకు సినిమా అందుబాటులో ఉంటుంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి వీక్షకులకు అత్యుత్తమ వినోదం అందించడానికి ‘జీ 5’ కృషి చేస్తుందని మరోసారి రుజువైంది. అందువల్ల, ప్రతి ఇంట ‘జీ 5’ పేరు వినబడుతోంది. జీ 5లో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల విషయం దక్షిణాది భాషలు మాట్లాడే ప్రేక్షకులను మాత్రమే కాదు… నాన్ సౌత్ స్పీకింగ్ ప్రేక్షకులకు కూడా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే… సబ్ టైటిల్స్ తో సినిమాను చూడొచ్చు కదా!

మే 20న ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రిలీజ్ సందర్బంగా జీ 5 కొత్త ట్రైలర్ విడుదల చేసింది. అది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మరోసారి సినిమాను చూడాలనే ఆసక్తి కలిగించింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో వసూళ్ల పరంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టించింది పదకొండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular