Monday, February 24, 2025
HomeTrending News‘పశ్చిమ’ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

‘పశ్చిమ’ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Bus Accident:
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో పడిన ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించినట్లు తెలుస్తోంది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో మొత్తం 47 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బస్సు నుంచి ప్రయాణికులను బైటకు తీసుకొచ్చేందుకు అధికారులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్