Monday, February 24, 2025
HomeTrending Newsకార్గో సర్వీసులపై 25శాతం డిస్కౌంట్

కార్గో సర్వీసులపై 25శాతం డిస్కౌంట్

 Rtc Cargo : రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీని గాడిన పెట్టేపనిలో భాగంగా ఎండీ సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు.ప్రతీ పండగ సందర్భంగా కొత్త కొత్త డిస్కౌంట్లను ఆయన ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీకి సంబంధించిన కార్గో, పార్శిల్ ఛార్జీలపై 25శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది.ఈ నెల 24 నుంచి మే 3 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆఫర్‌ లో భాగంగా 5 కేజీల వరకు మాత్రమే ఈడిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని ట్వీట్ చేశారు సజ్జనార్. ఇప్పటికే టీ 24 టికెట్ ద్వారా 24 గంటలపాటు లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధర 100 రూపాయలకే ఆర్టీసీ బస్సుల్లో 24గంటలపాటు హైదరాబాద్‌లో ప్రయాణించే అవకాశం కల్పించారు. తాజాగా ప్రకటించిన 25 శాతం డిస్కౌంట్ కి మంచి స్పందన వస్తుందనే అంచనా ఉంది.

Also Read : తెలంగాణలో తగ్గిన ఆర్టీసీ బ‌స్సులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్