Friday, March 20, 2026
Homeసినిమా'రూల్స్ రంజన్' సందడి గట్టిగానే ఉందే! 

‘రూల్స్ రంజన్’ సందడి గట్టిగానే ఉందే! 

కిరణ్ అబ్బవరం ఆ మధ్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. కథల విషయంలో .. తన పాత్రల విషయంలో కొత్తదనం ఉండేలానే చూసుకున్నాడు. డాన్సుల పరంగా .. ఫైట్స్ పరంగా మరింత కసరత్తు చేశాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. దాంతో ఆయన చాలా నిరాశకి లోనయ్యాడు. ఈ సారి కొంత గ్యాప్ తీసుకుని వస్తానని ఆ రోజునే చెప్పాడు. నిజంగానే ఆ తరువాత ఆయన బయట ఎక్కడా కనిపించలేదు.

రీసెంటుగా మళ్లీ తన సందడి మొదలైంది. ఆయన నుంచి రావడానికి ‘రూల్స్ రంజన్’ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం జోడీగా నేహా శెట్టి కనిపించనుంది. ‘డీజే టిల్లు’ సినిమాతో నేహా శెట్టికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె కాంబినేషన్లో చిత్రీకరించిన ‘సమ్మోహనుడా’ సాంగ్ ను కూడా ఈ రోజునే రిలీజ్ చేశారు. శ్రేయ గోషల్ ఆలపించిన ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యేలానే ఉంది.

వేమూరి మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి అమ్రిశ్ సంగీతాన్ని అందించాడు. ఆయన నుంచి వచ్చిన పాటలకి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ సినిమాలో తారాగణం కూడా కాస్త భారీగానే ఉంది. అభిమన్యు సింగ్ .. మకరంద్ దేశ్ పాండే .. సుబ్బరాజు .. అజయ్ .. వెన్నెల కిశోర్ .. గోపరాజు రమణ .. హైపర్ ఆది ముఖ్యమైన రోల్స్ చేశారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కిరణ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular