Sunday, January 19, 2025
Homeసినిమా‘వరుడు కావలెను’ కోసం తమన్ ఫోక్ సాంగ్

‘వరుడు కావలెను’ కోసం తమన్ ఫోక్ సాంగ్

నాగ శౌర్య , రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా నుంచి ఫోక్ గీతాన్ని నేడు (ఆగస్ట్ 4) విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్. ఈ సాంగ్ కు అబ్బుర పరిచే స్వరాలు సమకూర్చారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ ఆలపించిన మరో సుమధురమైన గీతం ఇది. సంగీత, సాహిత్యాల కలబోత ఈ వీడియో చిత్రం. ఈ సినిమా ద్వారా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే “నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో నాపగడ్డి సేలగాడ నాకేట్టి పనిరో..” అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత అనంత శ్రీరామ్ రచించారు. ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు.. సంగీతం, సాహిత్యం, నృత్యాలు ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన “కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా” పాట బహుళ ప్రజాదరణ పొందింది.

ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్