సాయిధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడు ‘బ్రో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. మేనమామ, మేనల్లుడు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించడంతో బ్రో మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం.
బ్రో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. కనీసం ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాట. మరో చిన్న సర్జరీ కూడా చేయించుకోబోతున్నాడట. ఈ గ్యాప్ లో పిజిక్ పై కూడా దృష్టి పెడతానని కొంత బరువు తగ్గి పూర్తి ఫిట్ నెస్ సాధిస్తానని తెలియచేశాడు. మళ్లీ గతంలో ఉన్న ఎనర్జీ రావాలంటే ఇప్పుడు 6 నెలలు గ్యాప్ తప్పనిసరి అంటున్నాడు. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు.
ఇప్పుడు బ్రో మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ నటించడం.. విరూపాక్ష తర్వాత వస్తున్న సినిమా కావడంతో బ్రో ఖచ్చితంగా భారీగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. విరూపాక్ష, బ్రో సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో మరింత స్పీడుగా సినిమాలు చేస్తాడు అనుకుంటే సినిమాలకు ఆరు నెలల గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రో తర్వాత ఎవరితో సినిమా చేస్తాడంటే.. ప్రస్తుతం కొన్ని కథలు విని ఒకటి రెండు ఫైనల్ చేశాడట. పూర్తి వివరాలను అంతా సెట్ అయిన తర్వాత ప్రకటిస్తాడని సమాచారం.