పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ ఈ సినిమాకు డెట్లు ఇచ్చినట్లు సమాచారం. త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇ
దిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తమిళ్ లో విజయం సాధించిన ‘వినోదయ సీతం‘ మూవీకి కూడా ఓకే చెప్పారు. సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నారు.
సాయిధరమ్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఇతర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. ‘వీరమల్లు… కు డేట్స్ ఇచ్చినా తేజ్ తో సినిమాపై ఎటూ తేల్చలేదు. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు. తేజ్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాడో.. మరో మూవీకి ఓకే చెబుతాడో చూడాలి.