Saturday, April 5, 2025
Homeసినిమాసాయిపల్లవికి గల క్రేజ్ అలాంటిది మరి!

సాయిపల్లవికి గల క్రేజ్ అలాంటిది మరి!

Craze Pallavi: తెలుగు .. తమిళ … మలయాళ భాషల్లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తన క్రేజ్ ను .. డిమాండ్ ను సాధ్యమైనంత  త్వరగా క్యాష్ చేసుకోవాలనుకునే టైపు కాదామే. పాత్ర నచ్చకపోతే పారితోషికం పెంచి  ఆమెను ఒప్పించడం కూడా కుదరని పనే. అలాగే ఒక సినిమాను ఆమె ఒప్పుకుందంటే ఆ పాత్రను ఒక తపస్సులా భావించి కష్టపడుతుంది. అలాగే తాను చేసిన సినిమా ప్రమోషన్స్ లో తాను పాల్గొనడం కూడా తన బాధ్యతగా భావిస్తుంది. ఇవన్నీ ఆమెపై మరింత అభిమానం పెరగడానికి కారణమయ్యాయి.

అలాంటి సాయిపల్లవి ఈ మధ్య కాలంలో చేసిన ‘లవ్ స్టోరీ’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలు భారీ విజయాలను సాధించాయి. రెండు సినిమాలు .. రెండు పాత్రలు ఒకదానికి ఒకటి ఎంతమాత్రం పొంతనలేని పాత్రలలో ఆమె జీవించింది. బరువైన .. పరిపక్వతతో కూడిన  పాత్రలను పోషించాలంటే  ఇప్పుడు అందరూ ముందుగా పరిశీలించే పేరు ఆమెదే. అలాంటి సాయిపల్లవి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘విరాటపర్వం‘ సినిమా ముస్తాబవుతోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిన్న ‘కర్నూల్’ లో ప్లాన్ చేశారు. అయితే కార్యక్రమం మొదలైన కొంతసేపటికే గాలిదుమారం .. ఆపై వర్షం కారణంగా అనుకున్న అంతరాయం కలిగింది. అయితే గాలివాన కాస్త తగ్గిన తరువాత సాయిపల్లవి స్టేజ్ పైకి వచ్చిన కాసేపు మాట్లాడింది. ఒక వైపున రానా .. మరో వైపున నవీన్ చంద్ర గొడుగు పట్టగా తాను చెప్పదలచుకున్న మేటర్ చెప్పేసింది. అలాంటి వాతావరణంలోను అప్పటివరకూ అభిమానులు ఆమె కోసం వెయిట్ చేయడం .. విజిల్స్ తో తమ ఆనందోత్సాహాలను ప్రకటించడం .. సాయిపల్లవికి గల క్రేజ్ కి నిదర్శనంగానే చెప్పుకోవాలి.

Also Read :  సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ గా ‘సోల్ ఆఫ్ వెన్నెల’

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్