Saturday, January 18, 2025
Homeసినిమాబాలీవుడ్ లో ‘ఫిదా’ బ్యూటీ ఎంట్రీ?

బాలీవుడ్ లో ‘ఫిదా’ బ్యూటీ ఎంట్రీ?

ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయిపల్లవి. మొదటి చిత్రం ఫిదాతో విజయం సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఆతర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’, ‘పడి పడి లేచే మనసు’ సినిమాల్లో నటించింది. తాజాగా నాగచైతన్య సరసన ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే దగ్గుబాటి రానా ‘విరాట పర్వం’ సినిమాలో కూడా సాయిపల్లవి నటించింది. ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమాలో నటిస్తుంది.

అయితే.. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమాపడితే ఆ సినిమా అంగీకరించకుండా కథ, అందులోని ఆమె పాత్ర నచ్చితేనే ఓకే చెబుతుంటుంది ఈ ఫిదా బ్యూటీ. అయినప్పటికీ.. గ్లామరస్ హీరోయిన్స్ పూజా హేగ్డే, రష్మిక మందన్నలతో పోటీపడుతూ వారితో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటుండడం విశేషం. ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దానికి సాయి పల్లవి కూడా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో..? ఏ హీరో సరసన నటించనుంది.? అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్