Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీలో సాయిప‌ల్ల‌వి నిజ‌మేనా..?

ఎన్టీఆర్ మూవీలో సాయిప‌ల్ల‌వి నిజ‌మేనా..?

NTR Fida: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. కొమ‌రం భీమ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించ‌డం తెలిసిందే. త‌దుప‌రి చిత్రాన్ని ఎన్టీఆర్.. కొర‌టాల శివ‌తో చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీకి సంబంధించి అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఈ నెల 20న రానుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ  సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టింనున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆలియా ఇటీవ‌లే పెళ్లి చేసుకోవ‌డం.. వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండ‌డంతో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని తెలిసింది. ఇప్పుడు ఆలియా ప్లేస్ లో ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత  సాయిపల్లవి మరో సినిమాకు కమిట్ అవలేదు. దాంతో ఇక ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా వినిపించింది కానీ.. తాజాగా సాయి పల్లవి.. ఎన్టీఆర్‌తో జోడి కట్టబోతోందని టాక్ వినిపిస్తోంది.

ఈ క్రేజి కాంబినేష‌న్ గురించి వింటానికే భలేగా ఉంది.. కానీ ఇందులో ఎంత వరకు నిజముందనేదది తెలియాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు సాయి పల్లవి మరో ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. సరైన స్క్రిప్టు, తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం వల్లే.. ఈ బ్యూటీ సినిమాలకు కమిట్ అవడం లేదట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది నిజ‌మా కాదా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్